60 ఏళ్ల ఇండియన్ రిటైర్డ్ అకౌంటెంట్ సొంతమైన Dh1 మిలియన్..!!
- January 18, 2025
యూఏఈ: ఇండియాలోని కర్ణాటకకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ సుందర్ మరకాల.. 25 ఏళ్లపాటు దుబాయ్‌లో నివసించారు. తాజా బిగ్ టికెట్ ఇ-మిలియనీర్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్‌లను ఆయన గెలుచుకున్నారు. అబుదాబి డ్రాలో సుందర్ మరకాల ఈ వారం విజేతగా నిలిచారు. అతను 2021 వరకు దుబాయ్‌లో నివసించారు. అనంతరం తన భార్య, కుమార్తెతో కలిసి తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. సుందర్ మరకాల మాట్లాడుతూ.. "ఇది నా మొదటి గెలపు. నేను మొదట నమ్మలేకపోయాను. నేను ఆనందంలో మునిగిపోయాను. కానీ అది స్కామ్ కాదని నిర్ధారించుకున్న తర్వాత మరింత సంతోషం కలిగింది. బహుమతిలో కొంత భాగాన్ని తన సోదరి, ఆమె కుటుంబ సభ్యులకు ఇస్తాను. మిగిలిన వాటిని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.’’ అని పేర్కొన్నారు.
25 మిలియన్ దిర్హాంల గ్రాండ్ ప్రైజ్
జనవరిలో గ్రాండ్ ప్రైజ్ Dh25 మిలియన్. ప్రతి టిక్కెట్ కొనుగోలు పాల్గొనేవారికి గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకునే అవకాశం మాత్రమే కాకుండా ఈ నెల మొత్తంలో ప్రతి వారం Dh1 మిలియన్లను గెలుచుకునే అవకాశం కోసం వీక్లీ డ్రాలలోకి ప్రవేశాన్ని కల్పిస్తారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







