రాష్ట్రంలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలి: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

- January 19, 2025 , by Maagulf
రాష్ట్రంలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలి: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి రహిత పాలన అందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న, అవినీతి, నష్టాలకు, అక్రమాలకు, దోపిడికి.. బీఆర్ఎస్​, కాంగ్రెస్ పార్టీలే కారణమని చెప్పారు. దేశంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులపై, ప్రభుత్వంపై ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు కనీసం ఆరోపణలు కూడా రాలేదని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భైరతాబాద్​ నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రజానీకం బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com