విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన వ్యక్తి.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..!!
- January 19, 2025
యూఏఈ: గంజాయి కలిపిన ఉత్పత్తులతో పట్టుబడిన వ్యక్తిని దుబాయ్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. యూఏఈ రాజ్యాంగం ప్రకారం.. దేశంలోని మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం మొదటి నేరానికి మినహాయింపు అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
రొటీన్ ఎక్స్-రే స్క్రీనింగ్ సమయంలో కస్టమ్స్ అధికారులు అతని లగేజీని ఫ్లాగ్ చేయడంతో మార్చి 3, 2024న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3లో సిరియన్ జాతీయుడు పట్టుబడ్డాడు.యూఏఈ చట్టం ప్రకారం నియంత్రిత మాదక ద్రవ్యంగా జాబితా చేయబడిన గంజాయి నూనెను కలిగి ఉన్న అనేక ఇ-సిగరెట్లు, ఫిల్టర్లను అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ అదే రోజు బెయిల్పై విడుదల చేశారు. తదుపరి పరీక్షలో గంజాయిలోని సైకోయాక్టివ్ భాగం టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) జాడలు నిర్ధారించడంతో ఏప్రిల్ 5 న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయిని కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రాసిక్యూటర్లు అతన్ని దుబాయ్ క్రిమినల్ కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులు ఫెడరల్ డిక్రీ-లా నెం. 30 ఆఫ్ 2021 ప్రకారం.. ఇది ఆహారం, పానీయాలు లేదా సంబంధిత ఉత్పత్తులలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్న వ్యక్తులకు అధికారిక ఎంట్రీ పాయింట్ల వద్ద చట్టపరమైన మినహాయింపులను అందిస్తుంది. దానిని మొదటి నేరంగా భావించి మినహాయింపు ఇస్తారు.
విచారణ సమయంలో ఆ వ్యక్తి తాను ఏథెన్స్లో ఇ-సిగరెట్లను చట్టబద్ధంగా వాటి రసాయన కాంబినేషన్ గురించి తెలియకుండానే కొనుగోలు చేశానని, వాటిని కేవలం వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించినట్లు పేర్కొన్నాడు. కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో మాదకద్రవ్యాలు ఉత్పత్తి తర్వాత ఉత్పత్తులకు జోడించబడ్డాయా లేదా వాటి అసలు స్థితిలో భాగమా అనేదానిని నిశ్చయాత్మకంగా నిర్ధారించలేకపోయారు. దాంతో ఆరోపణల నుంచి నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినప్పటికీ, మాదకద్రవ్యాల వినియోగం అభియోగం మీద దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టుకు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







