అమెరికాలో టిక్‌టాక్‌ పై నిషేధం..

- January 19, 2025 , by Maagulf
అమెరికాలో టిక్‌టాక్‌ పై నిషేధం..

అమెరికా: అమెరికాలో ప్రముఖ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్‌ టిక్‌టాక్ బ్యాన్ అయింది.టిక్‌టాక్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.అమెరికాలోని వ్యక్తులు ఇకపై టిక్‌టాక్ యాప్ ఉపయోగించలేరు. నెలల తరబడి న్యాయ పోరాటాల తర్వాత జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా టిక్‌టాక్‌ని నిషేధించే చట్టాన్ని జనవరి 17న అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది.

యుఎస్‌లోని టిక్‌టాక్ వినియోగదారులు ఇప్పుడు యాప్‌ను ఓపెన్ చేయగానే ఒక మెసేజ్ కనిపిస్తోంది. “దురదృష్టవశాత్తూ.. యుఎస్‌లో టిక్‌టాక్‌ను నిషేధించే చట్టం అమల్లోకి వచ్చింది. మీరు ప్రస్తుతం టిక్‌టాక్‌ని ఉపయోగించలేరు.అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిక్‌టాక్‌ను రీస్టోర్ చేసేందుకు అనుమతినిస్తారని భావిస్తున్నాం.దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి” అని మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

టిక్‌టాక్‌ని అమెరికా ఎందుకు నిషేధించింది. యుఎస్ అధికారులు టిక్‌టాక్ గురించి ఆందోళనలను లేవనెత్తారు. జాతీయ భద్రతకు ప్రమాదంగా పేర్కొంది. చైనీస్ ప్రభుత్వం అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు యాప్‌ను ఉపయోగించవచ్చుననే ఉద్దేశంతో విశ్వసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com