ట్రాఫిక్ లో హారన్ మోగిస్తే రూ.1000 జరిమానా
- June 29, 2016
ధ్వని కాలుష్యం నివారించడానికి కేంద్రం కొత్త చర్యలు చేపట్టనుంది. ట్రాఫిక్‌లో హారన్ మోగిస్తే రూ.1000 జరిమానా, ప్రజలకు ఇబ్బంది కలిగించే హారన్ సౌండ్లు మోగిస్తే రూ.లక్ష జరిమానా విధించేలా చర్యలు తీసుకోనుంది. ఈ పద్ధతి కానీ అమల్లోకి వస్తే.. అవసరం లేకపోయినా హారన్ కొట్టేవారికి మొదట రూ.500 జరిమానా విధిస్తారు.
అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాల్లో వికృతంగా హారన్ సౌండ్లు పెట్టుకునే వారు రూ.5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. అవసరమైతే ఇలాంటి హారన్లు అమ్మే వారిపై లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. రవాణా శాఖ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే మోటార్ వెహికిల్ యాక్ట్ సవరణ చట్టంలో ఈ ప్రతిపాదనలు భాగం కానున్నాయి.
వాహన చోదకుడు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి స్వల్పంగా హారన్ మోగించవచ్చు. లేదా హెడ్‌లైట్‌తో సిగ్నల్ ఇవ్వచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అవసరం లేనప్పుడు మాత్రం హారన్ మోగించకూడదు. నివాస ప్రాంతాల్లో అసలు హారన్ ఉపయోగించకూడదని కొత్త ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







