అబ్షర్ ద్వారా 8.5 మిలియన్ల ఇ-లావాదేవీలు..!!
- January 22, 2025
రియాద్: అంతర్గత మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ అబ్షర్ 2024, డిసెంబర్ నెలలో 8,521,000 కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ లావాదేవీలను నిర్వహించింది. గతంలో అబ్షెర్ ఇండివిజువల్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించబడిన కార్యకలాపాల సంఖ్య 6,022,000 ను అధిగమించింది. జాతీయ ID సంబంధిత 84,656 ఆపరేషన్లను నిర్వహించింది. జాతీయ గుర్తింపు కార్డును ఎలక్ట్రానిక్‌గా పునరుద్ధరించడానికి 37,962 ఆపరేషన్లు, 31,110 కుటుంబ సభ్యుల గుర్తింపు కోసం, 26,503 మై డేటా సర్వీస్ లో నమోదుకు, 15,79 డేటా సేవలో అప్డేట్ కోసం నిర్వహించింది. అలాగే, కోల్పోయిన జాతీయ గుర్తింపు కార్డు కోసం 9,282 కార్యకలాపాలు, 5,528 కుటుంబ రికార్డులు కోసం, 3,223 ఆపరేషన్లు దెబ్బతిన్న జాతీయ గుర్తింపు కార్డు కోసం వచ్చాయని వెల్లడించారు. అదే విధంగా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్లో 347,495 రెసిడెన్సీ పర్మిట్లు (ఇకామా) జారీ అయ్యాయని తెలిపారు. 261,969 ఎగ్జిట్ , రీఎంట్రీ వీసాలు.. 79,438 సౌదీ ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులు జారీ, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి 24,572 పాస్‌పోర్టులు జారీ, 20,111 ఎగ్జిట్, రీఎంట్రీ వీసా పొడిగింపు ఆపరేషన్స్, 12,338 సేవల బదిలీ కార్యకలాపాలు, 8,718 ఫైనల్ ఎగ్జిట్ కార్యకలాపాలను నమోదు చేసింది. పబ్లిక్ సెక్యూరిటీ సర్వీస్‌ల కోసం.. ప్లాట్‌ఫారమ్ వాహన మరమ్మతు అనుమతి సేవలో 125,162 ఆపరేషన్లను, 67,426 డ్రైవింగ్ ఆథరైజేషన్ అభ్యర్థనను జారీ చేసింది. వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సేవ కింద 61,583 ఆపరేషన్లను, ప్లేట్ రీప్లేస్మెంట్ సేవలో 47,032 కార్యకలాపాలను, వాహన విక్రయ సేవలో 29,417 కార్యకలాపాలను పూర్తి చేసింది. దెబ్బతిన్న వాహనాలను స్క్రాప్ చేయడంలో 9,037 కార్యకలాపాలు, తుపాకీ సేవల్లో 5,416 ఆపరేషన్లు, 3,957 డ్రైవర్ లైసెన్స్ పునరుద్ధరణలు, వాహన బీమా చెల్లుబాటు సేవలో 3,461 ఆపరేషన్లు నమోదు అయ్యాయి.
అబ్షర్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 1,316,869 ఆపరేషన్స్, రెసిడెన్సీ, పునరుద్ధరణ సేవలో 358,189 కార్యకలాపాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి విచారించడానికి 195,392 కార్యకలాపాలు, 195,392 కార్యకలాపాలతో సహా 2,499,000 కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. కస్టమ్స్ కార్డ్ ఎండార్స్మెంట్ సేవలో 79,555 కార్యకలాపాలను నిర్వహించారు. సేవలను బదిలీ చేసే సేవలో 75,248 కార్యకలాపాలు, వాహన యాజమాన్యం బదిలీని రిజర్వ్ చేయడానికి 57,152 కార్యకలాపాలు, క్రిమినల్ రికార్డ్ లేని సర్టిఫికేట్ సేవలో 34,628 కార్యకలాపాలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌ని పునరుద్ధరించే సేవలో 31,576 కార్యకలాపాలు, వాహనాన్ని రిపేర్ చేయడానికి 21,366 పర్మిట్లు, సందర్శకుల కోసం డ్రైవింగ్‌కు అనుమతికి 20,195 ఆపరేషన్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







