పండిన మామిడి పండ్లతో అందం..

- June 29, 2016 , by Maagulf
పండిన మామిడి పండ్లతో అందం..

పండిన మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మామిడి పళ్ల గుజ్జుతో పూతలని ఎలా వేసుకోవచ్చో చూడండి..
ఒ క చెంచా బాగా పండిన మామిడిపండు గుజ్జుని తీసుకుని, అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. అయితే పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తడి ఉండగానే మునివేళ్లతో రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.
రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్‌మీల్‌ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనం.
చెంచా గులాబీనీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా ముల్తానీమట్టికి.. రెండు చెంచాల మామిడిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం నిగారిస్తుంది.
రెండు చెంచాల పచ్చిపాలకి, చెంచా తేనెతోపాటూ పెద్దచెంచా మామిడిపండు గుజ్జుని కలిపి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com