యువ రాజకీయ మేరునగధీరుడు-నారా లోకేష్
- January 23, 2025
నారా లోకేష్ ... ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న యువనేత. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన తన తాతగారైన యుగపురుషుడు ఎన్టీఆర్, తెలుగు వారి అభివృద్ధికి ఎల్ల వేళలా పాటుపడుతున్న అలుపెరగని శ్రామికుడు, అభివృద్ధి భగీరథుడు, నవ్యంధ్రప్రదేశ్ రథసారథి తండ్రి నారా చంద్రబాబు నాయుడు స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టారు లోకేష్. రాజకీయాల్లో అడుపెట్టిన నాటి నుంచి నేటి వరకు తనపై రాజకీయ ప్రత్యర్ధులు అనవసరంగా చేస్తున్న హేళనలు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని తన రాజకీయ ఎదుగుదలకు సోపానాలు వేసుకున్న మేరునగధీరుడు మన లోకేషుడు. భారతదేశ ప్రగతి చిత్రపటంలో నవ్యంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు & ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆ యువనేత యొక్క స్ఫూర్తిదాయకమైన రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..
యువనేత నారా లోకేష్ 1983, జనవరి 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న భారతీయ విద్యాభవన్‌లో 10వ తరగతి, పూర్తి లిటిల్ ఫ్లవర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న కార్నెగీ మేలన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (Management Information Systems)లో బీఎస్సి, ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ ప్రధానాంశాలుగా ఎంబీఏ పూర్తి చేశారు.
లోకేష్ అమెరికాలో చదువుతున్న సమయంలోనే management trainee గా General Electric, Daimler Chrysler AG సంస్థల్లో పనిచేశారు. అలాగే, 2004 నుంచి 2006 వరకు ప్రపంచ బ్యాంకులో e-governance ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు. 2008 -12 వరకు లోకేష్ తమ కుటుంబానికి చెందిన "హెరిటేజ్" సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
లోకేష్ తాత గారైన ఎన్టీఆర్ భారత సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసిన మహానాయకుడు. తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (తెదేపా)ను స్థాపించి భారతదేశ రాజకీయ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి తెలుగు ప్రజల అభివృద్ధికి బాటలు పరిచారు. ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ పగ్గాలను చేపట్టిన రాజకీయ అపర చాణక్యుడైన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్ర రాజకీయాలను అటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తెలుగు నాట రాజకీయాల్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడిగా బాబు గారు చరిత్రలో నిలిచిపోయారు.
తాత, తండ్రి స్పూర్తితో ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు లోకేష్. వారసత్వం చాలా మందికి ప్లస్ అవుతుంది. కానీ అదే కొంత మందికి మైనస్ అవుతుంది. కానీ, యువనేత నారా లోకేష్‌కు వారసత్వం ఏ మాత్రం ప్లస్ కాలేదు. పైగా మైనస్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే ఆయన్ను నుంచే ట్రోల్ చేయడానికి వందల కోట్లు బడ్జెట్ పెట్టుకుని ఇతర పార్టీలు ప్రయత్నించాయి.
రాజకీయాల్లోకి వచ్చిన తనను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులకు తన పనితోనే తొలుత సమాధానం చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో తెరముందు బాబు గారి పాత్ర ఎంత ఉందో, అంతకంటే పది రేట్లు తెరవెనుక లోకేష్ గారి పాత్ర ఉంది. దశాబ్దం పాటు అధికారానికి దూరంగా పార్టీని అధికారంలోకి తీసురావడమే ధ్యేయంగా వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంలో తెరవెనుక లోకేష్ పాత్ర మరువలేనిది. చంద్రబాబు మూడో సారి సీఎం అవ్వడంలో లోకేష్ శ్రమను గుర్తించిన తెదేపా అధినాయకత్వం, ఆయన సేవలను పార్టీకే పరిమితం కాకుండా ప్రభుత్వంలో సైతం వినియోగించుకోవాలనే యోచనతో 2017లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
పంచాయితీరాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్, సాంకేతిక ఆధారంగా చేసుకొని మంత్రివర్గ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించడమే కాకుండా లక్షల సంఖ్యలో నల్లా నీటి కనెక్షన్లకు ఇవ్వడం, ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికుల జీతాల చెల్లింపులో ఎటువంటి దళారీ వ్యవస్థ యొక్క జాప్యం లేకుండా పారదర్శకతతో 100 శాతం చెల్లింపులు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న లోకేష్ పనితీరుకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఒక శాఖ మంత్రికి ఇన్ని అవార్డులు దక్కడం లోకేష్ గారికే సాధ్యం అయ్యింది.
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నవ్యంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమల ఖిల్లాగా మార్చాలన్న ధ్యేయంతో రాష్ట్రంలో వాణిజ్య నగరాలైన విజయవాడ, విశాఖపట్నం నగరాలను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దె క్రమంలో ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ మరియు మరికొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చారు. తిరుపతికి దగ్గర్లో ఉన్న రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటులో సైతం కీలకంగా వ్యవహరించారు. అనంతపురం పెనుకొండలో కియా, శ్రీసిటీ ఇండస్ట్రియల్ సెజ్‌లో పెప్సికో, హీరో కంపెనీలు సైతం తమ ప్లాంట్స్ ఏర్పాటు వెనుక లోకేష్ పాత్ర మరువలేనిది.
2019లో టీడీపీకి అత్యంత గడ్డు పరిస్థితి. ఆ ఏడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందడంతో ప్రతి ఒక్కరూ లోకేష్ వైపే వేలుచూపుతూ ఆయన్ని బాద్యుడ్ని చేయడానికి ప్రయత్నించారు. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేష్ అందుకోలేకపోతున్నారని.. ఆయన ఇమేజ్ రాష్ట్ర ప్రజల్లో పలుచగా ఉందని అనుకున్నారు. దాడులు, కబ్జాలు, స్కాములు వంటివి వద్దు రాజకీయాలు ప్రజల కోసం, కార్యకర్తల సంక్షేమం కోం అన్నారని .. ముద్దపప్పు అని ట్రోల్ చేశారు. చివరికి శరీరాకృతిని కూడా ట్రోల్ చేశారు. ఎంత ఘోరంగా నారా లోకేష్ ను టార్గెట్ చేశారంటే మరో లీడర్ అయితే మానసికంగా దెబ్బతిని .. వెనుకబడిపోయేవారు. కానీ అక్కడే తన పట్టుదల చూపారు లోకేష్.
పదేళ్లు తిరిగే సరికి ఇప్పుడు లోకేష్ ను పప్పు అనే వారి కన్నా నిప్పు అని తెలుసుకుని గగ్గోలు పెడుతున్న వారు వందల మంది ఉన్నారు. తమను వేటాడుతున్నాడని కలుగుల్లోకి పోయి దాక్కున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఆయనను ట్రోల్ చేయడానికి కూడా సాహసించలేరు. అంతగా ఇమేజ్ మార్చుకున్నారు. తనపై వందల కోట్లతో తప్పుడు ప్రచారం చేసిన వారికి తన సామర్థ్యం ఏమిటో నిరూపించారు.
2019-24 వరకు లోకేష్ చేసిన రాజకీయ పోరాటం మరువలేనిది. అవమానాలు, హేళనలను లెక్క చేయకుండా ప్రజా క్షేత్రంలోనే నిరంతరం గడుపుతూ వచ్చిన ఆయనకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. రాష్ట్ర ప్రజల యొక్క కష్ట, సుఖాలను తెలుసుకునేందుకు "యువగళం" పాదయాత్రను చేపట్టారు. పాదయాత్రలో ఆయన ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా, ప్రజలను ఆప్యాయంగా అక్కున చేర్చుకొని తమలో ఒకరిగా కలిసిపోయారు. లోకేష్ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడమే కాకుండా రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయడానికి ప్రేరేపించింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ప్రచార వ్యూహాలను పర్యవేక్షణ చేస్తూనే మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 2019లో సైతం అదే నియోజకవర్గం నుంచి పోటీ ఓటమి పాలైన లోకేష్, ఎక్కడ ఓడమో అక్కడే గెలవాలనే కృత నిశ్చయంతో ఐదేళ్ల పాటు మంగళగిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి కోసం ప్రజా పోరాటాలు నిర్వహించారు. అధికార వైకాపా దౌర్జన్యాలను సమర్థవంతంగా ఎదురించి మంగళగిరి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు. అందుకు ప్రతిఫలమే 1985 తర్వాత నుంచి తెదేపా గెలవని మంగళగిరిలో అత్యధిక భారీ మెజారితో విజయకేతనం ఎగురవేశారు.
నిజానికి చంద్రబాబు తనయుడిగా లోకేష్.. టీడీపీకి గట్టి పట్టు ఉండి, కచ్చితంగా గెలిచే చోటును ఏదైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ లోకేష్ రూటే సపరేటు. పార్టీ కండీషన్ చాలా టఫ్‌గా ఉన్న చోటే నిలబడి గెలిచారు. అనుకున్నది సాధించారు. చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో మానవ వనరులు & ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడం అలవాటు చేసుకున్న తన తండ్రి చంద్రబాబునే లోకేష్ స్పూర్తిగా తీసుకున్నారు. ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇదే మార్క్ చూపిస్తున్నారు. వర్క్ లో కచ్చితత్వం పెంచారు. ఏపీకి ఇప్పుడు ఏం అవసరం.. తనకు ఇచ్చిన శాఖల్లో పురోగతి చూపడం ఎలా అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పెట్టుకున్నారు. ఓవైపు పాలన, ఇంకోవైపు పార్టీ.. మరోవైపు ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడం ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చుట్టూ డైనమిక్ టీమ్ ను పెట్టుకున్నారు. దూకుడు పెంచారు.
టీడీపీ గత ప్రభుత్వంలోనూ మంత్రిగా లోకేష్ పని చేసినా.. ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు. స్పీడ్ పెంచేశారు. జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా జనం పాలకుల నుంచి ఏది మిస్సయ్యారో దాన్ని మంత్రి లోకేష్ గ్రహించారు. అందుకే ప్రజాదర్బార్ పేరుతో జనం నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. పరిష్కారంపై భరోసా ఇస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జనంపై చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇన్నాళ్లకు తమ సమస్యలు వినేనిజమైన ప్రజా నాయకుడు వచ్చాడు అనుకుంటున్నారు జనం. అటు మంత్రి లోకేష్ కూడా.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఆలోచన చేస్తున్నారు.
మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి తీరుతానంటున్నారు. రెండోసారి మంత్రి అయ్యాక లోకేష్ కు కీలక శాఖలే దక్కాయి. గతంలో చేపట్టిన ఐటీశాఖతో పాటు ఈసారి విద్యాశాఖ కూడా ఇచ్చారు. ఈ రెండూ ఛాలెంజింగ్ పోర్ట్ ఫోలియోసే. అయితే ఈ శాఖల్లో లోకేష్ తొలి రోజు నుంచే తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. రివ్యూ మీటింగ్ లు పెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై నజర్ పెట్టారు.
రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న అంశాలపై పూర్తిగా సమీక్షిస్తున్నారు. వీలైంత త్వరగా రిపోర్టులు ఇవ్వాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు బెస్ట్ మెథడ్స్ ఎక్కడ అమలవుతున్నాయో పరిశీలించాలన్నారు. విశాఖను ఐటి హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్లో ఉండాలని ఇప్పటికే అధికారులకు టార్గెట్ పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు పూర్వవైభవం తెచ్చేలా ఫోకస్ పెంచారు లోకేష్. అటు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా ఉండడంతో ఈ శాఖపై లోకేష్ ఫోకస్ మరింతగా పెంచారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అయి.. వారి ఆశలు, ఆకాంక్షల ప్రకారం విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సరికొత్త ఐడియాతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రెడీ చేశారు.
పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, అలాగే టీచర్లకు కేవలం చదువుల బాధ్యతలే ఉండేలా చూడాలనుకుంటున్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి ఉన్నతవిద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించేలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి టాప్ మోస్ట్ ప్రయారిటీలెన్నో లోకేష్ పెట్టుకున్నారు. ఒక విజన్‌తో పని చేస్తున్నారు. చెప్పాలంటే యంత్రాంగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు.
పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లకు లోకేష్ టార్గెట్ పెట్టారు. స్కూల్లో పెట్టె మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా నాణ్యతగా ఉండాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఫాలో అవుతున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ శానిటేషన్‌కు సంబంధించిన విధానాలను స్టడీ చేసి వాటి కంటే అత్యంత మెరుగైన పద్ధతులను అమలు చేయాలంటున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలను విశ్లేషించి రిపోర్ట్ ఇవ్వాలని సమగ్ర శిక్షణ అధికారులను ఆదేశించారు.
బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు స్కూల్ ఎంత దూరంలో అందుబాటులో ఉందన్న వివరాలనూ అడిగారు. గత ఐదేళ్లలో మూతపడ్డ స్కూళ్లు, అందుకు గల కారణాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆర్డర్ వేశారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన అధికార నోట్ ను కూడా అందజేయాలని లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన అధికార నివాసంలో ప్రతి నెల ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తూ.. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాజకీయాలు అంటే ఖూనీలు, కబ్జాలు, స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించిన వారికి మాత్రమే కేక్ వాక్ కాదు… స్టాన్‌ఫర్డ్‌లో చదువుకోని వచ్చిన వారికి కూడా చేతనవుతాయని నిరూపించారు. దావోస్‌లో ఆయన చొరవ చూస్తున్న పారిశ్రామికవేత్తలు సైతం భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి చదువుకున్న రాజకీయ నేతల అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇక్కడ సామాన్య ప్రజల్లో మాస్ లీడర్‌గా లోకేష్ గుర్తింపు పొందారు.
లోకేష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిని అక్రమ కేసుల్లో అరెస్టు చేసినప్పుడు ఢిల్లీలో చంద్రబాబు ఇమేజ్ కాపాడేందుకు ఆయన జాతీయ మీడియా ముందు గట్టిగా వాదన వినిపించారు. జాతీయ నేతలనూ చర్చించారు. కేవలం రాజకీయవేధింపుల కోసమే అరెస్టు చేశారని అందరికీ చెప్పగలిగారు. 21వ శతాబ్దంలో భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు తీసుకెళ్ళగలిన సత్తా ఉన్న యువనేతల్లో లోకేష్ అగ్రపథాన ఉన్నారు. నారా లోకేష్‌ను టార్గెట్ చేయని రాజకీయం లేదు. చిన్న వయసులోనే ఆయన అన్నీ ఎదుర్కొన్నారు. రాబోయే రోజులో ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







