రాజధాని ప్రయాణికులకు ఎయిర్ఇండియా వినూత్న ఆఫర్

- June 30, 2016 , by Maagulf
రాజధాని ప్రయాణికులకు ఎయిర్ఇండియా వినూత్న ఆఫర్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్ కన్ఫమ్ కాలేదా? ఫీలవ్వకండి.. మీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఎయిరిండియా ఉంది. తమ కొత్త స్కీమ్‌లో భాగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ కొన్నా బెర్త్ దక్కని ప్రయాణికులను ఎయిరిండియా వారి గమ్యస్థానాలకు చేరవేయనుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రాజధాని ప్రయాణికులు.. ఎయిరిండియా ఫ్లైట్ డిపార్చర్‌కు నాలుగు గంటల ముందు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. రాజధాని ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ ధరలోనే ఫ్లైట్ టికెట్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో 21 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజుకు 20 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిలో బెర్త్ దొరకని వారు మరిన్ని వేలమంది ఉంటారు. వారందరూ అదే టికెట్ ధరలో ఎంతో ముందుగానే గమ్యస్థానానికి చేరుకునే వీలు ఉంటుంది. ముంబై, చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ల ధరలు వరుసగా 4755, 6335గా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com