మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- January 25, 2025
యూఏఈ: యూఏఈలో పీర్ ముహమ్మద్ ఆజం అనే 41 ఏళ్ల భారతీయ ప్రవాసుడు జనవరి 11న తన మొదటి ప్రయత్నంలోనే అదృష్టాన్ని పొందాడు. మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్నారు.దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలోని సీనియర్ ఎలక్ట్రీషియన్ అయిన ఆజం యూఏఈ లాటరీ మొదటి మిలియనీర్ అయ్యారు. " నేను లైవ్ డ్రాను చూశాను. విజేత సంఖ్యలను చూశాను. నమ్మలేదు. మళ్లీ ఆన్లైన్లో చెక్ చేసాను. అప్పుడు నేను నిజంగా గెలిచినట్లు నమ్మాను." అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి 20 టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆజం, మరుసటి రోజు వారిని అభినందించేందుకు ఫోన్ చేశానని చెప్పాడు. ప్రైజ్ మనీతో ఏమి చేయాలో అతను ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే తన యూఏఈ లాటరీ కాదని, మళ్లీ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటానని తెలిపారు."నేను 100 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ గెలిస్తే, నేను భూమిపై నిలబడను. ఆనందం, థ్రిల్ తో ఆకాశంలో ఎగిరిపోతాను." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







