ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్ రద్దుతో 14 విమానాలు మళ్లింపు..!!
- January 25, 2025
దుబాయ్: హర్గీసా అంతర్జాతీయ విమానాశ్రయం (HGA)కి వెళ్లే ఫ్లైదుబాయ్ విమానం శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నుండి టేకాఫ్‌ను చివరినిమిషంలో రద్దు చేశారు. దీని వలన యూఏఈలోని సమీప విమానాశ్రయాలకు 14 ఇన్‌బౌండ్ విమానాలను మళ్లించాల్సి వచ్చింది. విమానం ఆలస్యానికి కారణం తెలియరాలేదు.కానీ దుబాయ్‌కి చెందిన క్యారియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ప్రత్యామ్నాయ విమానంలో వారి ప్రయాణాన్ని కొనసాగించారని తెలిపారు.ప్రయాణికుల భద్రతకే తమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. "ప్రయాణికుల ప్రయాణ షెడ్యూల్‌కు జరిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము" అని ఎయిర్‌లైన్ తెలిపింది. టేకాఫ్ రద్దుతో 14 ఇన్‌బౌండ్ విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. “శుక్రవారం ఉదయం ఫ్లైదుబాయ్ ఫ్లైట్ (FZ661) టేకాఫ్ సస్పెండ్ కారణంగా షెడ్యూల్ కు అంతరాయం కలిగింది. అయితే, కొద్ది సమయంలోనే DXB సాధారణ కార్యకలాపాలకు తిరిగి వచ్చింది." అని DXB తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







