ఒమన్‌లో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన..పలువురు అరెస్ట్..!!
- January 25, 2025
మస్కట్: బౌషర్‌లోని విలాయత్‌లో పబ్లిక్ ఆర్డర్ ను ఉల్లంఘిండంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని విఘాతం కలిగించడం, శాంతికి విఘాతం కలిగించినందుకు కొందరు యువకులను మస్కట్ గవర్నరేట్ పోలీసులు అరెస్టు చేశారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకారం.. వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, విన్యాసాలు చేయడం, లౌడ్‌స్పీకర్‌లు, వాహనాల ఎగ్జాస్ట్‌లకు మార్పులు చేసి ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా అధిక శబ్దాన్ని సృష్టిస్తూ పబ్లిక్ ఆఫెన్స్ కు కారణం అయ్యారు. మరో ఘటనలో అల్ దహిరా గవర్నరేట్ పోలీసులు ఐదుగురు సిటిజన్స్ ను ధాంక్ విలాయత్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక సామాజిక సమావేశంలో తుపాకీలను ఉపయోగిచారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారందరిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







