హైద్రాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు

- June 30, 2016 , by Maagulf
హైద్రాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు

నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు సంయుక్తంగా నిన్న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో భాగంగా పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన ఎన్‌ఐఏ అధికారులు ఐదుగురిని ఐసిస్ ఉగ్రవాదులుగా తేల్చారు. వీరిని అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. మరో ఆరుగురిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఈమేరకు ఇవాళ ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరుచనున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. అదుపులో ఉన్న ఒకరిని తర్వాత విడిచిపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com