షాప్ ఖతార్ 2025.. మూడవ రాఫిల్ డ్రా విజేతలు వీరే..!!

- January 26, 2025 , by Maagulf
షాప్ ఖతార్ 2025.. మూడవ రాఫిల్ డ్రా విజేతలు వీరే..!!

దోహా: షాప్ ఖతార్‌లో జరిగిన మూడవ రాఫిల్ డ్రాలో విజేతల వివరాలను ప్రకటించారు. విజిట్ ఖతార్ నిర్వహించిన అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా జనవరి 24న ప్లేస్ వెండోమ్ మాల్‌లో డ్రా నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే షాపింగ్ ఫెస్టివల్‌లో నాలుగు రాఫిల్ డ్రాలలో ఇది మూడవది. ప్రతి 200 QAR కొనుగోలుతో డ్రాలో పాల్గొనవచ్చు. చివరి డ్రా ఫిబ్రవరి 1న దోహా ఫెస్టివల్ సిటీలో జరుగుతుంది. ప్రతి శుక్రవారం అదృష్ట విజేతలు లగ్జరీ ఎక్సీడ్ కార్లు, QAR 10,000 నుండి QAR 100,000 వరకు నగదు బహుమతులు, టెస్లా సైబర్‌ట్రక్ వంటి బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని పొందారు.

విజేతల వివరాలు

ఖంగ్డు షెర్పా (వోచర్ నంబర్ 347143), ఓలాన్ వీస్కా (వోచర్ నంబర్ 238329) ఇద్దరు అదృష్ట ఎక్సీడ్ కార్ల విజేతలు. QR100,000 నగదు బహుమతిని మహమ్మద్ కయకూల్ (వోచర్ నంబర్ 111098), QR50,000 జెబా శాంతి (వోచర్ నంబర్ 346104), QR30,000 ఏంజెలా హామ్సన్ (వోచర్ నంబర్ 388963) గెలుచుకున్నారు. హమ్దా అల్-నమీ (వోచర్ నంబర్ 521099), MA కార్లా వెలాస్కో (వోచర్ నంబర్ 343315) QR20,000 గెలుచుకోగా, ముస్తఫా అలవ్ని (వోచర్ నంబర్ 385909), ప్రిన్సెస్ సెబాస్టియన్ (వోచర్ నంబర్ 555547) QR10,000 నగదు బహుమతులు గెలుపొందారు.

షాప్ ఖతార్ ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుంది.  దేశంలోని అత్యంత ప్రసిద్ధ షాపింగ్ మాల్స్ ప్లేస్ వెండోమ్, దోహా ఫెస్టివల్ సిటీ, మాల్ ఆఫ్ ఖతార్, సిటీ సెంటర్ మాల్, ల్యాండ్‌మార్క్ మాల్, విల్లాజియో, లగూనా మాల్, అల్ హజ్మ్, హయత్ ప్లాజా, తవార్ మాల్, అల్ ఖోర్ మాల్, మషీరెబ్ గల్లెరియా, దోహా ఒయాసిస్, గల్ఫ్ మాల్, అబు సిద్రా మాల్, ది దోహా మాల్, ఎజ్దాన్ అల్ వక్రా, ది గేట్ మాల్ లో అందుబాటులో ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com