ఒకే పేరు ఉన్న ఇద్దరు బాలురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
- June 30, 2016
మృత్యువు సైతం పేర్ల ప్రకారం.... జాబితా వెతక్కోని మరీ ప్రాణాలను తీసుకువెళుతుందా అన్నట్లు ఉంది ఈ దుర్ఘటన. ఒకే రోజు ఒకే పేరు ఉన్న ఇద్దరు బాలురు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం విడ్డురంగా ఉందని బహ్రయినీయులు విస్తుపోతున్నారు. ఫిరోజ్ మహ్మద్ అహ్మద్, మూడు ఏళ్ల ఈజిప్టు బాలుడు తప్పిపోయినట్లు పిర్యాదు చేసిన కొన్న గంటల తర్వాత చనిపోయినట్లు కనుగొనబడింది.ఆ బాలుడు సోమవారం మధ్యాహ్నం పొరుగున ఉన్న పిల్లలతో ఆడుతున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లి అతనికి పిలిచినపుడు ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడో ఎవరూ కనిపెట్టలేదు ఆ కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ బాలుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు జరిగినది. సోషల్ మీడియా ఆ బాలుని చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రచారం కల్పించారు.అతని గురించి ఏ సమాచారం లభించినా తెలియచేయాలని కోరారు. మంగళవారం ఉదయం ఆ బాలుని శరీరం వారి ఇంటి పొరుగున ఉన్న కారు ట్రంక్ లోపల కనుగొనబడింది, ఒక ఫార్మసీలో పనిచేస్తున్న సుడాన్ దేసనానికి చెందిన వ్యక్తి తన ఆవరణలో నిలిపి ఉన్న ఒక కారు లోపల కుళ్ళి కంపుకొడుతున్న వాసన వస్తుందని పొరుగువాళ్లకు నివేదించారు. పోలీసులు ఇప్పటికీ ఈ సంఘటన గూర్చి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే పేరు గల మరో బాలుడు ఫిరోజ్ అబ్దుల్ ఇమాఎం 7 ఏళ్ల బాలుడిని బహ్రేయినీ పశ్చిమ రాజధాని మనామాలో బనీ జంటా గ్రామంలో ఒక కారు డీ కొట్టడంతో సోమవారం మృతి చెందాడు. విధి ఆడిన వింత నాటకంలో అతని గమ్యం ఒక విషాద కారు ప్రమాదంలో ముగియబడింది ," ఆ బాలుని బంధువు చెప్పారు. " ఫిరోజ్ చాలా మంచి బాలుడు ఇరుగుపొరుగు పిల్లల ప్రశంసలు మరియు బంధువులు, పొరుగువారు, స్నేహితులు మధ్య ఎంతో ప్రజాదరణ పొందాడు . అతని హఠాన్మరణం మాకు ఒక పెద్ద షాక్, అది కష్టం భయంకరమైన వాస్తవం అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా ఫిరోజు తల్లి వచ్చి మా అబ్బాయి ఎపుడు ఇంటికి వస్తాడని ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతుంది.
సామాజిక మీడియాలో ఈ రెండు మరణాల గూర్చి విషాద నేపథ్యం బాహిరేణీయులు ఐక్యత భావనను వ్యక్తం కాబడింది.ఇద్దరు పిల్లలు మరియు వారి పేర్లు యాదృచ్చికంగా వయసులోనూ ఒకే బాధ ..ఒకే మరణ కోణాన్ని ఆవిష్కరించింది. "రెండు పువ్వులు, ఒకే రోజున వాడి పోయాయి ఒకరు కారులో ఎక్కి ... మరొకరిపై కారు ఎక్కి చనిపోయారని ఒక మీడియా యూజర్ చెప్పారు. "వారు మైళ్ల దూరంలో ఉన్నారు..కానీ వాళ్ళ ఒకే పేర్లు , ఫిరోజ్ వారి అమాయకత్వం..వారి చిన్ని గుండెలతో పెనవేసుకున్నబంధాల విలువ పంచుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







