మహారాష్ట్ర: ప్రయాణికులకు బిగ్ షాక్..
- January 26, 2025
ముంబై: మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. కాగా, ఆటోలు, క్యాబ్స్ బేస్ ఛార్జీలు కూడా రూ.3కు పెంచారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (MMRTA) దీనిని ఆమోదించింది. దీంతో ఆటో బేస్ రేట్లు రూ.23 నుంచి రూ.26కు, టాక్సీ బేస్ ఛార్జీలు రూ.28 నుంచి రూ.31కు పెరిగాయి. అలాగే బ్లూ అండ్ సిల్వర్ ఏసీ కూల్ క్యాబ్ ఛార్జీలను కూడా రూ.8కు పెంచారు. దీంతో తొలి 1.5 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం రూ.40 ఉండగా కొత్త ఛార్జీ మేరకు రూ.48కు పెరిగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్‌లలో ఒకటి, సుమారు 15,000 బస్సులను నడుపుతోంది మరియు ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తోంది. కాగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







