అదరకొడుతున్న కబాలి ప్రొమోషన్స్
- June 30, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోస్టర్స్, టీజర్‌తో అభిమానుల అంచనాలను పూర్తిగా పెంచేసిన కబాలి త్వరలోనే థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండియన్ సినిమాలో ఏ సినిమాకు చేయని రేంజ్‌లో కబాలి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇన్నాళ్ళు ఆటోలు, బస్సులు, ట్రైన్స్ పై మాత్రమే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ చూశాం. కాని తాజాగా విమానాలపై కూడా సినిమా పోస్టర్‌లు దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ వ్యవహారానికి శ్రీకారం చుట్టింది ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటించిన కబాలి చిత్ర పోస్టర్స్ ఎయిర్ ఏషియా విమానాలపై కనిపిస్తుండగా, వీటిని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక ఎయిర్ ఏషియా సంస్థ అయితే అభిమానులకు ఏకంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.'ప్లై లైక్ ఏ సూపర్ స్టార్' అనే కాన్సెప్ట్‌తో ఎయిర్ ఏషియా జూలై 3 వరకు ఆన్‌లైన్లో కొన్ని ప్రత్యేక బుకింగ్స్‌ని ఓపెన్ చేసింది. అసలు రేట్ కంటే తక్కువ ధరకే ఆ సంస్ధ వారు ఈ బుకింగ్స్ ఇవ్వడం విశేషం. అయితే కబాలి చిత్రం కోసం ఇండియాలోనే కాదు ప్రక్క దేశాలలోని రజనీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి చిత్రంలో రాథికా ఆప్టే, ధన్సిక ప్రత్యేక పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే.


తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







