ఏపీ: నిరు పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు
- January 27, 2025
అమరావతి: బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటిస్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇవ్వనున్నట్లు తెలిపింది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని, కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారుగా ఉండకూడదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలోని పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







