'బద్మాషులు'- ఫస్ట్ లుక్ రిలీజ్
- January 27, 2025
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై B. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ కంప్లీట్ ఎంటర్ టైనర్ కి 'బద్మాషులు' అనే క్రేజీ టైటిల్ ని ఖరారు చేశారు.
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. టైటిల్ డిజైన్ చాలా క్రియేటివ్ ఎట్రాక్ట్ చేస్తోంది.
గ్రామీణ నేపధ్యంలో జరిగే హాస్య భరిత చిత్రమిది. ప్రతి సన్నివేశం లో కడుపుబ్బా నవ్వుకుని ఆ అనుభూతిని నలుగురు పంచుకునే చిత్రం. ఈ చిత్రం లోని ప్రతి పాత్ర మీ నిజజీవితం లో మీ ఊరిలోని మీరు కలిసిన వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి. కథనం పరంగా నవ్విస్తూనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
ఈ చిత్రానికి తేజ కూనూరు సంగీతం అందిస్తున్నారు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రాఫర్. గజ్జల్ రక్షిత్ కుమార్ ఎడిటర్.
నటీనటులు- మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్, అంజి ఇతరులు
దర్శకత్వం-శంకర్ చేగూరి
నిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్
బ్యానర్: తార స్టొరీ టెల్లర్స్
సంగీత దర్శకులు- తేజ కూనూరు
సినిమాటోగ్రాఫర్- వినీత్ పబ్బతి
ఎడిటర్- గజ్జల రక్షిత్ కుమార్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







