గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి – 8 మందికి తీవ్రగాయాలు

- January 28, 2025 , by Maagulf
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి – 8 మందికి తీవ్రగాయాలు

నంద్యాల జిల్లా చాపి రేవుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు సిలిండర్ పేలి ఇద్దరు దినేష్ (10),వెంకటమ్మ (60) మృతి చెందిన సంఘటన జరిగింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యా యి. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గ్రామంలోని బాధిత బంధువులు పోలీసులు ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఇంటికి బంధువులు వచ్చారని మేరకు వారికి వంట చేయాలన్న ఉద్దేశంతో తెల్లవారుజామున నాలుగు గంటలకి వంట గదిలోకి వెళ్లారు. అప్పటికే గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి లైట్ వేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ పేలుడు శబ్దం సంభవించింది. .భారీ పేలుడుకు ఇల్లు శిథిలావస్థమైపోయింది.పక్కనున్న ఇల్లుతో సహా కూడా కూలిపోయాయి. భారీ శబ్దానికి గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బాధిత బంధువులు గ్రామస్తులు ఆ విషాద సంఘటన పట్ల రోదనలు ఏడుపులు చూపరులకు కంటనీరు చెప్పించాయి.ఇల్లు కూలిపోవడంతో శిదిలాల కింద భాగం బాధితులను బయటికి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు.

సంఘటన జరిగిన రెండు గంటలు శ్రమించి డ్రిల్లింగ్ మిషన్ తో ఇనుప కడ్డీలను తొలగించి అతి కష్టం మీద బాలుడు దినేష్ మృతదేహాన్ని వృద్ధురాలు వెంకటమ్మ మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన ఎనిమిది మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com