మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ జరీమానాలు

- June 30, 2016 , by Maagulf
మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ జరీమానాలు

రంజాన్‌ సందర్భంగా వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఔట్‌ లెట్స్‌పై చర్యలు చేపట్టింది మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ. ఈద్‌ సందర్భంగా బట్టలు, పెర్‌ఫ్యూమ్స్‌, డ్రెస్‌ మేకర్స్‌, టైలర్స్‌, జ్యుయెలరీ మరియు గోల్డ్‌, ఫుడ్‌ ఔట్‌లెట్స్‌, రెస్టారెంట్స్‌, హోటల్స్‌, బ్యూటీ సెలూన్స్‌, బార్బర్‌ షాప్స్‌ వంటి సుమారు 1800 షాప్‌లతో తోపాటు కమర్షియల్‌ ప్లేసెస్‌, మార్కెట్స్‌లో తనిఖీలు జరిగాయి. గడువు తీరిన ఆహార పదార్థాలు, నిర్ధారిత ధర కన్నా అదనంగా అమ్మకాలు జరుపుతున్నవారు, ధరల్ని మ్యానిప్యులేట్‌ చేస్తున్నవారిని తనిఖీల సందర్భంగా ఎక్కువగా గుర్తించారు. 3000 ఖతార్‌ రియాల్స్‌ నుంచి 1 మిలియన్‌ ఖతార్‌ రియాల్స్‌ వరకూ వీరిపై జరీమానాలు విధిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com