మూడు ట్రక్కుల ఢీ: ఒకరి మృతి
- June 30, 2016
ఎమిరేట్స్ రోడ్‌పై జరిగిన ప్రమాదంలో మూడు ట్రక్కులు ధ్వంసం కాగా, ఒకర్ని ఈ ప్రమాదం బలి తీసుకుంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని ఆసియాకి చెందిన 43 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఒక వాహనం ఇంకో వాహనంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. షార్జా వింటర్ క్యాంప్స్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. మొదటి ట్రక్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. మరో డ్రైవర్, తీవ్ర గాయాల పాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. రహదార్లపై ప్రయాణించే వాహనాలు నిర్ధారిత వేగంతో వెళితే ప్రమాదాల్ని నివారించవచ్చనీ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







