హైదరాబాద్ మెట్రో: రెండు గంటల పాటు నిలిచిన మెట్రో సర్వీస్ లు

- January 29, 2025 , by Maagulf
హైదరాబాద్ మెట్రో: రెండు గంటల పాటు నిలిచిన మెట్రో సర్వీస్ లు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నేటి ఉదయం నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి మెట్రో రైళ్లు.దీంతో..హైదరాబాద్‌ వాసులు గందరగోళానికి గురైయ్యారు.సాంకేతిక కారణాలతో నాగోల్-రాయదుర్గం రూట్‌లో మెట్రో సేవల్లో ఆలస్యం అయింది.

అటు అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఉదయాన్నే ఆఫీస్ వేళలు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు నిలిచిపోవడంతో.. హైదరాబాద్‌ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మెట్రో స్టేషన్లలో వేలాది సంఖ్యలో ప్రయాణికులు వచ్చి..నిలబడిపోయారు.రెండు గంట‌ల త‌ర్వాత మ‌ళ్లీ మెట్రో స‌ర్వీస్ లు ప్రారంభ‌మ‌య్యాయి…దీనిపై మెట్రో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌తోనే స‌ర్వీస్ లకు అంత‌రాయం క‌లిగింద‌ని పేర్కొంది.రెండు గంట‌ల పాటు స‌ర్వీస్ లు నిలిచిపోవ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసింది.ప్ర‌యాణీకుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి క్ష‌మించాల‌ని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com