ఐసీసీ సీఈవో జెఫ్ అలార్జీస్ రాజీనామా
- January 29, 2025
న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది.మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుండగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్జీస్ తన పదవికి రాజీనామా చేశారు.అతడు రాజీనామా చేయడానికి గల కారణాలు అయితే ఇంత వరకు వెల్లడి కాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్థాన్ సన్నద్ధతను స్పష్టంగా వివరించలేకపోవడం ఆయన రాజీనామాకు ఓ కారణంగా ఓ ఐసీసీ సభ్యుడు పేర్కొన్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.అమెరికా వేదికగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ప్లాఫ్ కావడం, అక్కడ అనుకున్న బడ్జెట్ కంటే అధికంగా కావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాక్లో పర్యటించబోమని చెప్పడంతో హైబ్రిడ్ మోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు.కరాచీ, లాహోర్, రావల్సిండి వేదికగా పాక్లో మ్యాచ్లు జరగనున్నాయి. అయితే..ఈ స్టేడియాలను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆధునీకరించే పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.అయితే..టోర్నీ సమయం దగ్గర పడుతున్నా కూడా పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష