వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!

- January 29, 2025 , by Maagulf
వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!

కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వాహన డ్రైవర్లపై ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం తెలిపింది. ఇందుకు దేశవ్యాప్తంగా కొత్త తరం ఏఐతో పనిచేసే ట్రాఫిక్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అధునాతన కెమెరాలు, అధిక-నాణ్యతతో రికార్డు చేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ ఫ్లో తోపాటు డ్రైవర్ ప్రవర్తన సహా రహదారిపై అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు.  ఈ కెమెరాలు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు భద్రతా బలగాలకు సహాయపడతాయని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, ఈ కెమెరాలు 40వేల సీట్ బెల్ట్, హ్యాండ్-హెల్డ్ ఫోన్ ఉల్లంఘనలను రికార్డ్ చేశాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com