కీలక రంగాలలో పెట్టుబడులు.. ఒమానీ-ఖతారీ ఫోరమ్ సమీక్ష..!!
- January 29, 2025
మస్కట్: మస్కట్‌లో సమావేశమైన ఒమానీ-ఖతారీ ఎకనామిక్ ఫోరమ్.. ఒమన్ - ఖతార్ మధ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, తయారీ రంగాలలో ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఒమన్ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ సమావేశమైంది. ఈ పర్యటనలో ఒమన్ - ఖతార్ దౌత్య శిక్షణ, సామాజిక అభివృద్ధి రంగాలలో సహకారం కోసం రెండు అవగాహన ఒప్పందాలు (MOU) కుదిరాయి. వీటితోపాటు సాంస్కృతిక, విద్య, క్రీడలు, యువత సహకారం వంటి కీలక కార్యనిర్వాహక కార్యక్రమాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలు, వివిధ రంగాలలో అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష