ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..

- January 29, 2025 , by Maagulf
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీ హరీష్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ఆయన జీవోను విడుదల చేశారు.1992కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ డిజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి, కొత్త డీజీపీ ఎంపిక రెండు వారాల క్రితమే ఖరారు అయింది.

నెలాఖరులో ద్వారాకా తిరుమల రావు పదవీ విరమణ:
ఈ నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉందోనని ఆసక్తిగా మారింది.ఈ నేపథ్యంలోనే ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ గుప్తాను ఎంపిక చేస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com