షార్జాలో కొత్త పిగ్మీ జంతు ప్రదర్శనశాల..టిక్కెట్ల ధర Dh20..!!
- January 30, 2025
యూఏఈ: షార్జాలో ఇటీవల ప్రారంభించబడిన పిగ్మీ జంతుప్రదర్శనశాల అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ అల్బినో కంగారూలు, మరుగుజ్జు గుర్రాలతోపాటు అనేక జంతువును ఒకేచోట చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. జంతుప్రదర్శనశాల యజమాని అబ్దుల్లా బింజరాష్ కు జంతువులంటే ఆసక్తి. అందుకే 10 సంవత్సరాల క్రితం కొన్ని జంతువులతో ప్రారంభించారు. మొదట దుబాయ్లో చిన్నగా ప్రారంభామని, తరువాత అజ్మాన్లో, ఐదేళ్ల తర్వాత షార్జాకు వచ్చామని తెలిపారు. ప్రవేశ రుసుము పెద్దలకు Dh20, పిల్లలకు Dh15గా నిర్ణయించారు. ఒక రోజును ఆస్వాదించేందుకు అన్ని కుటుంబాలకు జూను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అబ్దుల్లా తెలిపారు.
పిగ్మీ జంతుప్రదర్శనశాల ప్రతి విభాగంలో 15 నుండి 16 రకాల జంతువులను కలిగి ఉందని, విభిన్న మండలాల్లో వివిధ రకాల అరుదైన జాతులను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. జంతుప్రదర్శనశాల ప్రతిరోజూ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష