ఉమ్ సలాల్లో 17 ఏళ్ల యువకుడిపై సింహం దాడి..!!
- January 30, 2025
దోహా, ఖతార్: ఉమ్ సలాల్లో 17 ఏళ్ల ఖతార్ యువకుడిపై ఓ సింహం దాడి చేసింది. ఈ దాడిలో యువకుడి తలకు, శరీరంలోని వివిధ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి... ఉమ్ సలాల్ ప్రాంతంలో ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది. గాయపడిన యువకుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు 2022లో సింహం పిల్లను (4 నెలల వయస్సు) తీసుకొచ్చాడని, అయితే దాని కారణంగా అతడు అలెర్జీలక గురయ్యాడు. దాంతో దానిని జంతు శిక్షణ నిపుణుడి సంరక్షణకు తరలించారు. అనంతరం ఆ యువకుడు సింహాన్ని 3 సార్లు సందర్శించాడు. కాగా, దాడికి దారితీసిన మూడవ సందర్శన జనవరి 12న జరిగింది. ఆ సమయంలో తన కుమారుడిపై సింహం దాడి చేసిందన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడిని హమద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడిపై ఆడ సింహం దాడి చేసిందన్న పుకార్లను కొట్టిపారేసిన తల్లి, శిక్షకుడు పెంచిన సింహమే తన కుమారుడిపై దాడి చేసి గాయపరిచిందని, ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష