ఫుజైరాలో 29 ఆహార సంస్థలు మూసివేత..!!

- January 31, 2025 , by Maagulf
ఫుజైరాలో 29 ఆహార సంస్థలు మూసివేత..!!

యూఏఈ: 2024లో ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన  29 ఆహార సంస్థలను ఫుజైరా మున్సిపాలిటీ మూసివేసింది.ఈ సంస్థలు ప్రజారోగ్యానికి హాని కలిగించే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఫుజైరా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ అఫ్ఖమ్ తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు.  అన్ని ఆహార ఉత్పత్తులు అత్యధిక ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంటూ సూచించారు.మున్సిపాలిటీ ఆరోగ్య నియంత్రణ విభాగం గతేడాది 31,462 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా 1,525 అధికారిక హెచ్చరికలు జారీ చేశారు.   బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్‌లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్‌లతో సహా కీలకమైన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు అల్ అఫ్ఖమ్ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com