వాషింగ్టన్ దుర్ఘటన పై సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- January 31, 2025
రియాద్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం ప్రయాణీకుల విమానం మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొన్న దుర్ఘటనపై రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు.ఈ మేరకు వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖను పంపినట్లు అధికారులు తలిపారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం,యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఢీకొన్నాయి. 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కూడిన విమానం కాన్సాస్ నుండి బయలుదేరింది. శిక్షణ విమానంలో ఉన్న హెలికాప్టర్‌లో ముగ్గురు సైనిక సిబ్బంది ఉన్నారు. ప్యాసింజర్ విమానం పొటోమాక్ నదిలో కూలిపోయింది.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేనందున ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







