గుడ్డు ముట్టీల మాంసం
- June 30, 2016
కావలసినవి: మటన్ కైమా 500 గ్రా., వేయించిన శనగపప్పు 100 గ్రా., అల్లం 10 గ్రా., వెల్లుల్లి 10 గ్రా., పచ్చిమిర్చి 15 గ్రా., కారం 10 గ్రా., దాసించెక్క చిన్న ముక్క, లవంగాలు ఐదారు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర ఒక కట్ట, పుదీన సగం కట్ట, మంచినూనె 150 గ్రా.
ఎలా చేయాలి
కైమాను శుభ్రంగా కడగాలి. శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కారం, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, ఉల్లి, కొత్తిమీర, పుదీన అన్నిటినీ కైమాలో కలిపి గ్రైండర్లో వేసి మెత్తగా చేయండి. తరువాత తడిచేత్తో దానిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టండి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగించిన తర్వాత కైమా ముద్దలను వేసి మూతపెట్టి సన్నని సెగమీద పూర్తిగా ఉడికే దాకా ఉంచండి. ఆ తరువాత పెనం మీద నెయ్యిగాని, నూనెగాని వేసి గుడ్డు కొట్టి కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేయాలి. దానిమీద కైమాబాల్పెట్టి అదమండి రెండోవైపు కూడా కాల్చాక ఉల్లిపాయ ముక్కలతో కలిపి వేడివేడిగా తినండి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







