సింగపూర్‌లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం
- June 30, 2016
సింగపూర్‌లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పరిశ్రమకు చెందిన సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురు భామలు తమ డ్యాన్సులతో అలరించారు. ఇక మెగా స్టార్ చిరంజీవికి సైమా గ్రాండ్ వెలకమ్ చెప్తూ, తన 150వ చిత్రానికి బెస్ట్ విషెస్‌ని అందించింది. అంతేకాదు చిరుని ఫెలిసిటేట్ చేయడానికి స్టేజ్‌పైకి ఇన్వయిట్ చేసింది సైమా. ఇక ఆ సమయంలో మన తెలుగు సినిమా నటీనటులంతా చిరుతో కలిసి సెల్ఫీ దిగేందుకు స్టేజ్‌పైకి పరుగులు తీశారు. చిరు కూడా వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. రానా, మంచు లక్ష్మీ, శిరీష్, అల్లు అరవింద్, కుష్బూ, సమంత, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సెల్ఫీలో పార్ట్ అయినందుకు తెగ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ మెగా సెల్ఫీని చూసిన మెగాస్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







