సింగపూర్‌లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం

- June 30, 2016 , by Maagulf
సింగపూర్‌లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం

సింగపూర్‌లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పరిశ్రమకు చెందిన సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురు భామలు తమ డ్యాన్సులతో అలరించారు. ఇక మెగా స్టార్ చిరంజీవికి సైమా గ్రాండ్ వెలకమ్ చెప్తూ, తన 150వ చిత్రానికి బెస్ట్ విషెస్‌ని అందించింది. అంతేకాదు చిరుని ఫెలిసిటేట్ చేయడానికి స్టేజ్‌పైకి ఇన్వయిట్ చేసింది సైమా. ఇక ఆ సమయంలో మన తెలుగు సినిమా నటీనటులంతా చిరుతో కలిసి సెల్ఫీ దిగేందుకు స్టేజ్‌పైకి పరుగులు తీశారు. చిరు కూడా వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. రానా, మంచు లక్ష్మీ, శిరీష్, అల్లు అరవింద్, కుష్బూ, సమంత, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సెల్ఫీలో పార్ట్ అయినందుకు తెగ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ మెగా సెల్ఫీని చూసిన మెగాస్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com