ఫిబ్రవరి 3 నుండి ICP ఖోర్ ఫక్కన్ ఆఫీస్ మూసివేత..!!
- February 01, 2025
యూఏఈ: షార్జాలోని ఖోర్ ఫక్కన్‌లోని రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ను ఫిబ్రవరి 3 నుండి నాలుగు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రకటించింది. ఈ మేరకు అథారిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించింది. కస్టమర్‌లు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి అధికార సంస్థ సమీపంలోని దిబ్బా అల్ ఫుజైరా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్, ఫుజైరా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్,కల్బా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ లను సందర్శించవచ్చని అధికారులు నివాసితులకు సూచించారు.
ICP వీసా జారీ, ప్రవాసుల కోసం పర్యాటక,నివాస వీసాలకు ప్రవేశ అనుమతిని అందించడం వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది. యూఏఈ నివాసితులకు జాతీయ గుర్తింపు కార్డుగా పనిచేసే ఎమిరేట్స్ IDని కూడా జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







