రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!

- February 01, 2025 , by Maagulf
రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!

రియాద్: రియాద్ సీజన్ 2024కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సందర్శకులు స్వాగతం పలికినట్లు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్  ప్రకటించారు. ఈ సీజన్ ఇంకా కొనసాగుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్‌లు,  ప్రదర్శనలు జరుగుతాయని అల్-షేక్ తెలిపారు.

రియాద్ సీజన్ ఈ సంవత్సరం ఎడిషన్ వినోదం, టెక్నాలజీలో ప్రధాన గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్ట్స్, క్రీడల ప్రపంచాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు.  రియాద్ సీజన్ పర్యాటకం, వినోద రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ సీజన్ థియేట్రికల్, సంగీత ప్రదర్శనలు, ఎస్పోర్ట్స్ టోర్నమెంట్‌లు, అంతర్జాతీయ ఫుడ్ అనుభవాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఆకర్షణలతో సహా ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com