అవినీతి కేసుల కోసం.. సౌదీ అరేబియాలో కొత్త నిబంధనలు..!!
- February 01, 2025
రియాద్: అవినీతి కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులు, సంస్థల కోసం కొత్త ఆర్థిక పరిష్కార నిబంధనలను ఆమోదిస్తూ రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఒక ఉత్తర్వును జారీ చేశారు. ఇది నిధులను వేగంగా రికవరీ చేసి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఆమోదించినందుకు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌లకు పర్యవేక్షణ , అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ఛైర్మన్ మజెన్ అల్-కహ్మౌస్ కృతజ్ఞతలు తెలిపారు. దుర్వినియోగం చేసిన ప్రభుత్వ నిధులను పునరుద్ధరించడానికి, ఆర్థిక అవినీతికి సంబంధించిన కేసుల దర్యాప్తు, పరిష్కారాల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నియమాలు సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఆమోదించబడిన నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. సెటిల్‌మెంట్‌లోకి ప్రవేశించిన వారు చోరీ చేసిన నిధులను తిరిగి ఇవ్వాలి లేదా వాటి నుండి వచ్చే ఆదాయాలతో సహా తిరిగి చెల్లించాలి. అదే సమయంలో దుర్వినియోగం చేయబడిన నిధులపై ఐదు శాతం వార్షిక పెనాల్టీని కూడా చెల్లించాలి. నేరం జరిగినప్పటి నుండి పూర్తి తిరిగి చెల్లించే వరకు మొత్తం లెక్కించి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అవినీతి కేసు మరియు ఏదైనా సంబంధిత నేరాలను పూర్తిగా బహిర్గతం చేసినందుకు బదులుగా, సెటిల్‌మెంట్‌లోకి ప్రవేశించే వ్యక్తులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందుతారు. సెటిల్మెంట్ ఒప్పందం పూర్తికి గరిష్టంగా మూడు సంవత్సరాల వ్యవధి అనుమతి ఉంటుంది. ఈ గడువులోపు వారు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారిపై క్రిమినల్ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక ఒక సంవత్సరంలోపు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వ్యక్తులు సెటిల్మెంట్ నిబంధనలను పూర్తిగా పాటిస్తే, వారికి ఐదు శాతం పెనాల్టీ రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







