ఫిబ్రవరి 8న బహ్రెయిన్ ప్రీమియర్ సైక్లింగ్ రేస్..!!

- February 01, 2025 , by Maagulf
ఫిబ్రవరి 8న బహ్రెయిన్ ప్రీమియర్ సైక్లింగ్ రేస్..!!

మనామా: అబ్దుల్ హకీమ్ అల్ షమ్మరీ గ్రూప్ హోల్డింగ్ సైక్లింగ్ రేస్ ఐదవ ఎడిషన్ ఫిబ్రవరి 8న జరుగనుంది. బహ్రెయిన్ ప్రధాన సైక్లింగ్ ఈవెంట్‌లలో ఒకటైన ఇది జల్లాక్‌లోని బీచ్ లో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో 20కి పైగా దేశాల నుండి అగ్రశ్రేణి రైడర్‌లు వివిధ విభాగాలలో పోటీపడతారు. బహ్రెయిన్ సైక్లింగ్ అసోసియేషన్ (BCA) సహకారంతో నిర్వహించనున్నారు. ఈ పోటీలను తొమ్మిది కేటగిరీలలో నిర్వహిస్తున్నట్టు బీసీఏ అధ్యక్షుడు డా. షేక్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. మొదటి రేసు ఫిబ్రవరి 8న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com