యూఏఈలో ఫేక్ డిజైనర్ బ్యాగ్‌ల ఫ్రాడ్..మహిళలే వాళ్ల టార్గెట్..!!

- February 01, 2025 , by Maagulf
యూఏఈలో ఫేక్ డిజైనర్ బ్యాగ్‌ల ఫ్రాడ్..మహిళలే వాళ్ల టార్గెట్..!!

యూఏఈ: యూఏఈలో అనేక మంది మహిళలు యూరోపియన్ మహిళ నుండి నకిలీ డిజైనర్ బ్యాగ్‌లను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియా స్కామ్‌కు గురయ్యారు. విక్రేత బ్యాగ్‌లను ప్రామాణికమైన, తగ్గింపు వస్తువులు అని తప్పుగా క్లెయిమ్ ప్రమోషన్ చేస్తున్నారని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.  

దుబాయ్‌లో నివసిస్తున్న బాధితురాలు బొలీవియన్ ప్రవాస మారియా కథనం ప్రకారం.. 10,000 మంది సభ్యులతో ఫేస్‌బుక్ గ్రూప్‌లో విక్రేత నుండి ఒక పోస్ట్ రావడంతో ఆమె Dh2,000కి 'చానెల్' బ్యాగ్‌ని కొనుగోలు చేసింది. సారూప్య మోడల్‌ల అసలైన బ్యాగ్‌లు సాధారణంగా Dh9,000కి అమ్ముడవుతాయి.దీంతో ఈ డీల్ లాభంగా అనిపించి కొనుగోలు చేశఆరు.  అనంతరం నకిలీ డిజైనర్ వస్తువుల విక్రయంపై విక్రేత గురించి ఆన్‌లైన్ చర్చలు చూసిన తర్వాత మరియాకు అనుమానం కలిగింది. ఆమె తన బ్యాగ్‌ని వెరిఫికేషన్ కోసం అధీకృత చానెల్ స్టోర్‌కి తీసుకువెళ్లింది, అక్కడ ఆమె భయాలు నిజమయ్యాయి. అది నకిలీదని వారు తేల్చారు.  తను రీఫండ్ కోసం సంప్రదించినప్పుడు,  వారు తిరస్కరించారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరో బాధితురాలు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. తాను ఆగస్టు,  డిసెంబర్ 2024 మధ్య 10 బ్యాగ్‌లను కొనుగోలు చేసింది. ఒక్కొక్కటి Dh1,500 - Dh2,000 చెల్లించినట్లు వెల్లడించింది. అనంతరం అవి ఫేక్ అని తెలిసి షాక్ అయినట్లు తెలిపారు. తనకు జరిగిన మోసం మరేవరికి జరగరాదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  ఆమె 2,000 దిర్హామ్‌లకు కొనుగోలు చేసిన ‘డిజైనర్’ బ్యాగ్ వాస్తవానికి నకిలీ మార్కెట్‌లో కేవలం 200 దిర్హామ్‌లకే విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారు సోషల్ మీడియాలో ఫిర్యాదుల చేస్తున్నారు.    

దుబాయ్ కస్టమ్స్ 2023లో 333 మేధో సంపత్తి వివాదాలను నిర్వహించింది. 73.4 మిలియన్ దిర్హామ్ విలువైన 15 మిలియన్ నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకుంది. నివాసితులు అధికారిక దుకాణాలతో వస్తువుల ప్రామాణికతను ధృవీకరించుకోలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అధికారులకు నివేదించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com