పైప్‌లైన్ బరస్ట్‌తో షార్జా నివాసితులకు నీటి సమస్య
- June 30, 2016
షార్జా లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవనున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా నీటి సరఫరాలో ఇబ్బందులు కలగజేయడం పట్ల సార్జా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సెవా) స్పందించింది. నీటి సరఫరా సమస్యకు కారణం 32 ఇంచ్‌ల పైప్‌లైన్ అల్‌ఖాన్ ఏరియాలో పగిలిపోయిందనీ, దాంతో అల్ నహ్దా, అల్‌మంజర్, అల్ జజాజ్ అబు షాగారా ప్రాంతాల్లో సమస్యలు తలెత్తాయని వివరించింది. సిబ్బంది గత రెండు రోజులుగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అధికారులు వివరించారు. అయితే నీటి సమస్య కారణంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు సమీపంలోని తమ సన్నిహితుల ఇళ్ళకు వెళ్ళి స్నానాధికాలు పూర్తి చేసి, కార్యాలయాలకు వెళ్ళలాల్సి వస్తుందని వాపోతున్నారు. వాతావరణం వేడిగా ఉండటంతో నీటి అవసరం ఇంకా ఎక్కువవుతోందనీ ఈ సమయంలో నీటి సరఫరా సమస్య తమకు చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయా ప్రాంతాల్లోని నివాసితులు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







