ట్రంప్ కి దెబ్బకి దెబ్బ.. అమెరికా మీదే టారిఫ్ విధించిన కెనడా
- February 02, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కెనడా, మెక్సికో దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా పాలన సాగిస్తున్నారు. పలు దేశాల దిగుమతులపై పన్నుల భారాన్ని పెంచుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై 25శాతం సుంకం విధించే ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ నిర్ణయం పట్ల కెనడా, మెక్సికో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ కు కెనడా బిగ్ షాకిచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం చర్చల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించింది. అదనపు టారిఫ్ లు విధించింది. ఇదే క్రమంలో 155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25శాతం టారిఫ్ లు విధిస్తున్నాం. అయితే, వీటిలో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. 125 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులపై 21రోజుల వ్యవధి తరువాత అమలవుతాయి.’’ అంటూ ట్రూడో పేర్కొన్నారు.
అంతకుముందు ట్రంప్ చైనా నుండి అన్ని దిగుమతులపై 10శాతం, మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై 25శాతం సుంకాలు విధించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అయితే, కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనం, చమురు, సహజ వాయువు, విద్యుత్ పై 10శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా నిర్ణయం కెనడా, మెక్సికో దేశాల ఆర్థిక ప్రతిష్టంభనను కలిగించే అవకాశం ఉంది. మెక్సికో, కెనడా దేశాలు అమెరికా యొక్క రెండు అతిపెద్ద వ్యాపార భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వారికి ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.
దిగుమతులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ సంతకాలు చేసిన కొద్దిసేపటికే ట్విటర్ వేదికగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. త్వరలోనే మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ తో మాట్లాడతానని తెలిపారు. అయితే, మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్ లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ పేర్కొన్నారు. మెక్సికో పొరుగు రాష్ట్రాల సహకారం కోరుకుంటుంది.. ఘర్షణ కాదు. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, టారిఫ్ లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని షేన్ బామ్ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ట్రంప్ తన నిర్ణయం మార్చుకోకపోతే ప్లాన్-బి ని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నట్లు షేన్ బామ్ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష