కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభం..!!

- February 03, 2025 , by Maagulf
కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభం..!!

కువైట్: కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.బయాన్ ప్యాలెస్‌లో అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేత కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా, హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా, సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ , కాసేషన్ కోర్ట్ హెడ్ అడెల్ బౌరెస్లీ పాల్గొన్నారు.  హిస్ హైనెస్ అమీర్ మోటర్‌కేడ్ ఆధ్వర్యంలో వేదిక వద్దకు చేరుకున్నారు. ఆర్మీ, పోలీస్, నేషనల్ గార్డ్ సిబ్బంది 21-గన్ సెల్యూట్ చేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం అమీర్ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com