శింబు ఓ థ్రిల్లింగ్ మూవీతో..
- July 01, 2016
వినోద ప్రపంచంలో వివాదాలూ మామూలే. సినీరంగంలో ఒక్కోసారి పెద్ద హీరోలను కూడా కొన్ని కాంట్రవర్సీస్ చుట్టుముడతాయి. బాగా సాగుతున్న కెరీర్ లో వాటివల్ల టైం వేస్ట్ కావడంతో పాటు ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అయితే...అవన్నీ సర్దుకొని... మళ్లీ కెరీర్ నే కొనసాగించేవారూ ఉన్నారు. నిన్న మొన్నటివరకు బ్యాడ్ బాయ్ అనిపించుకున్న తమిళ హీరో శింబు ఇప్పుడు ఓ థ్రిల్లింగ్ మూవీతో ముందుకొస్తున్నాడు.ఇదు నమ్ ఆళు రిలీజ్ లేటైన టైంలో శింబు, గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ...అచ్చం ఎన్బదు మదమైఎద మూవీని కంప్లీట్ చేశాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. తెలుగులో ఈ సినిమా... సాహసమే శ్వాసగా సాగిపో పేరుతో వస్తోంది. నాగచైతన్య హీరో. ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు మరో మంచి ఛాన్స్ కొట్టేశాడు. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో 'ఎఎఎ' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వెరైటీ స్టోరీతో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ...ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం. ఈమధ్య రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా థ్రిల్లింగ్ గా మూడు ముఖాలతో ఉంది. మరో విశేషమేమంటే... ఈ సినిమాలో కేరక్టర్ చేసేందుకు శింబు బాగా బరువు పెరుగుతున్నాడట. ఈ మూవీలో అతను ఒక జైంట్ మాన్ లా కనబడాల్సి ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ పిక్చర్ శింబుకు టర్నింగ్ పాయింట్ కావచ్చని కూడా అంటున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







