చైనాకు చైనాయే సాటి..
- July 01, 2016
చైనా సాంకేతికంగానే కాదు.. పర్యాటక రంగంలోనూ ముందుంటుంది. వింతైన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ... భిన్నమైన ప్రదేశాలను సృష్టించడంలోనూ చైనాకు చైనాయే సాటి. దేశం దాటకుండానే ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన కట్టడాలను సందర్శించేలా మారు కట్టడాలను రూపొందించడంలో దిట్ట. అలా ఇప్పటి వరకు ప్రముఖ నిర్మాణాలకు నమూనా కట్టడాలనే నిర్మించిన చైనా.. ఇటీవల రెండు దేశాల ప్రధాన భవనాలను కలిపి ఓ అద్భుతమైన హైబ్రిడ్ భవనాన్ని నిర్మించింది.ఈఫిల్ టవర్.. పీసా టవర్.. ఈజిప్టు పిరమిడ్.. తాజ్‌మహల్.. లండన్ బ్రిడ్జి ఇలా ప్రపంచంలో చెప్పుకోదగ్గ కట్టడాలను పోలిన కట్టడాలను నిర్మించి చైనా సందర్శకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. షిజియాజుయంగ్ నగరంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం 'వైట్‌హౌస్'ను.. చైనీయులు పూజించే బీజింగ్‌లోని 'టెంపుల్ ఆఫ్ హెవెన్' ఆలయాన్ని కలిపి హైబ్రిడ్ భవనాన్ని గ్రేట్ వాల్ ఇంటర్నేషనల్ మూవీస్ స్టూడియో సంస్థ నిర్మించింది.ఒకవైపు 'వైట్‌హౌస్'.. మరోవైపు 'టెంపుల్ ఆఫ్ హెవెన్'ను పోలిన రూపుతో ఈ భవనం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో ఈ భవనాన్ని సినిమా చిత్రీకరణలకు వినియోగించుకునేలా నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







