'ఇట్స్ కాంప్లికేటెడ్' ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల
- February 04, 2025స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ చిత్రం కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్, ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పుడు, రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది - ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కాంప్లికేటెడ్'గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది.
రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పెరెపు ఓ హిలేరియస్ వీడియోతో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి కూడా హింట్ ఇచ్చారు.
ట్యాలంటెడ్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకి షానియల్ డియో, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు డీవోపీగా పని చేశారు, ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యుమర్, ఎమోషనల్ హై అందిస్తుందని ప్రామిస్ చేస్తోంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







