దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. టిక్కెట్లు గంటలోపే సోల్డౌట్..!!
- February 04, 2025
దుబాయ్: దుబాయ్‌లో జరిగే ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత మ్యాచ్‌ల టిక్కెట్లు సాయంత్రం 4 గంటలకు అమ్మకానికి పెట్టగా, సెకన్ల వ్యవధిలో అమ్ముడుపోయాయి. కేవలం 2 నిమిషాల్లో క్యూ 111,000గా చూపింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని దాదాపు గంట సేపు క్యూలో నిరీక్షించిన క్రికెట్ అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. సెకన్ల వ్యవధిలో అన్ని కేటగిరీల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. వీటిలో ప్లాటినం కేటగిరీ ధర Dh2,000, ది గ్రాండ్ లాంజ్ కేటగిరీ ధర Dh5,000 ఇవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలామంది అభిమానులు నిరాశ చెందాలు. ఈసారికి టీవీల్లోనే చూడాలని నిట్టూర్చారు. షార్జాకు చెందిన నమితా అనీష్ మాట్లాడుతూ.. ఇండియా-పాక్ మ్యాచ్‌కు హాజరు కావడానికి మొదట్లో క్యూలో ఉండగానే, తక్కువ రేట్ కేటగిరీ టిక్కెట్లు సోల్డౌట్ అయ్యాయని, దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో "చాలా ఖరీదైనవి" టిక్కెట్లను కొనుగోలు చేద్దామనుకుంటే అవి కూడా దక్కలేదని వాపోయారు. కానీ, దుబాయ్‌లో ఈ సంవత్సరం కనీసం ఒక మ్యాచ్‌ని చూడాలని నిశ్చయించుకున్న తనకు, ఇండియా vs న్యూజిలాండ్‌కు "జనరల్ అడ్మిషన్" టిక్కెట్ దక్కినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.ఫిబ్రవరి 20న ఇండియా vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న ఇండియా vs పాకిస్తాన్, మార్చి 2న ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 4న తొలి సెమీఫైనల్‌కు, భారత్ పెద్ద మ్యాచ్‌కు అర్హత సాధిస్తే మార్చి 9న ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష