తక్షణమే స్పందించి ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీపీ సుధీర్ బాబు

- February 04, 2025 , by Maagulf
తక్షణమే స్పందించి ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: ఈరోజు చర్లపల్లి పారిశ్రామికవాడలో సర్వోదయ salvent రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తక్షణమే స్పందించి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ప్రమాద స్థలంలో స్వయంగా సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ దుర్ఘటనలో ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా పరిశ్రమలలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఇతర సాంకేతిక పరమైన ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.అనంతరం అధికారులకు స్థానికులకు తగిన సూచనలు జాగ్రత్తలు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com