ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్

- February 04, 2025 , by Maagulf
ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్

ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది.ఈ ర్యాంకులను నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి వంటి అంశాల ఆధారంగా రూపొందించారు. అయితే, ఈ టాప్-10 జాబితాలో భారతదేశానికి చోటు దక్కకపోవడం విశేషం.

టాప్-10 దేశాల్లో అమెరికా, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది.

భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, శక్తివంతమైన దేశాల టాప్-10లోకి ప్రవేశించలేకపోయింది. భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి దేశానికి ఇంకా కొన్ని రంగాల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారతదేశం మిలిటరీ పరంగా బలంగా ఉన్నప్పటికీ, రాజకీయ, ఆర్థిక, కూటమి శక్తుల్లో మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతర్జాతీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, గ్లోబల్ లీడర్‌షిప్‌ లో మరింత ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ జాబితా ప్రకటించడంతో భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, మిలిటరీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఏడాదుల్లో భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో భారత్ గ్లోబల్ పవర్‌గా నిలుస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com