యూఏఈలో 50కిపైగా ఆత్మహత్యలను అడ్డుకున్న 'క్రైమ్ మ్యాప్'..!!

- February 05, 2025 , by Maagulf
యూఏఈలో 50కిపైగా ఆత్మహత్యలను అడ్డుకున్న \'క్రైమ్ మ్యాప్\'..!!

యూఏఈ: నేరాలు జరిగే ముందు సమస్యలను అంచనా వేసే క్రైమ్ మ్యాప్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా యూఏఈ అధికారులు దేశ భద్రతను మెరుగుపరిచారు.  "గత సంవత్సరం మేము 50 కంటే ఎక్కువ ఆత్మహత్య కేసులను నిరోధించాము.వాటితోపాటు హత్య, మాదకద్రవ్యాల వ్యాపారం, మోసం వంటి అనేక నేరాలు జరుగకుండా అడ్డుకున్నాం." అని సైబర్ సెక్యూరిటీ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ అల్ కువైటీ వెల్లడించారు.  మంగళవారం అబుదాబిలో ప్రారంభమైన ఏఐ ఎవ్రీథింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. క్రైమ్ మ్యాప్ చొరవ అనేది యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, సైబర్ సెక్యూరిటీ విభాగం మధ్య సహకారానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం.  "నేరాల చరిత్ర, ప్రపంచ పోకడల ఆధారంగా అల్గారిథమ్‌లతో [మ్యాప్] నేరాలను అంచనా వేస్తుంది. మాకు నోటిఫికేషన్‌లు, నివేదికలను అందిస్తుంది" అని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో ఎమర్జెన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్ ప్రాసిక్యూషన్ హెడ్ సేలం అలీ జుమా అల్ జాబి అన్నారు.  తాము వ్యక్తుల డేటా, చరిత్ర ఆధారంగా విశ్లేషణ చేస్తామన్నారు.  దేశవ్యాప్తంగా కెమెరాల ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించి సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నేరం జరిగిన తర్వాత, తాము వెళ్లి దర్యాప్తు చేస్తామని, కానీ, తాము దానిని నిరోధించాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే తాము ఈ AI మోడల్‌లు , మెషీన్‌లను ఉపయోగిస్తున్నామని, వాస్తవానికి మాకు ముందస్తు హెచ్చరిక సూచికలను అందిస్తాయని పేర్కొన్నారు.  తాము నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ని ఉపయోగిస్తామని, ఇది AI- సాధికారత కలిగిన కేంద్రం, ఇది 90 శాతం కంటే ఎక్కువ దాడులను ఆటోమెటిక్ గా ఆపుతుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com