ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..
- February 05, 2025
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది.ఈరోజు సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఉండనున్నాయి. ఇక, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి జై శంకర్,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీలో 1.56కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు కేటాయించారు.. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్‌కు అవకాశం ఇవ్వగా.. 7980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అయితే దేశంలోనే తొలిసారిగా.. ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల దగ్గర రద్దీని తెలుసుకునేందుకు వీలుగా క్యూ మేనేజిమెంట్ సిస్టమ్ (QMS) అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంఘం 3వేల పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పింక్ కలర్ రంగుల్లో బూత్‌లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్‌లు ‘మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం’ అంటూ స్పెషల్ థీమ్‌ను తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!